KTR: కేటీఆర్ ట్వీట్ కు స్పందించిన నిర్మలా సీతారామన్

  • భూముల బదలాయింపుపై ఎటువంటి సంశయం లేదు
  • అధికారులు వివరాలన్నీ సేకరించి ఖరారు చేస్తారు
  • ఇతర రాష్ట్రాల విషయంలోనూ ఇలాగే వ్యవహరించాం: నిర్మలా సీతారామన్
రక్షణ శాఖ భూముల బదలాయింపు విషయమై తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఓ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా రక్షణశాఖ భూములను బదలాయించాలని అందులో కోరారు. ఈ ట్వీట్ కు నిర్మలా సీతారామన్ స్పందిస్తూ, భూముల బదలాయింపుపై ఎటువంటి సంశయం లేదని స్పష్టం చేశారు.

సంబంధిత అధికారులు వివరాలన్నీ సేకరించి ఖరారు చేస్తారని, ఇతర రాష్ట్రాల విషయంలోనూ ఇలాగే వ్యవహరించామని తెలిపారు. కాగా, నిర్మలా సీతారామన్ స్పందనపై కేటీఆర్ కృతఙ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా త్వరితగతిన సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.
KTR
nirmala sitaraman

More Telugu News