కేసీఆర్ ప్రభుత్వంపై గుత్తా జ్వాల సంచలన ట్వీట్.. ఆ పై తొలగింపు!
- అకాడమీ ఏర్పాటుకు, ఇంటికి స్థలమిస్తామన్నారు
- నాలుగేళ్లు అయినా ఆ ఊసు లేదు
- ఆవేదన వ్యక్తం చేసిన బ్యాడ్మింటన్ స్టార్
బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు, ఇంటి స్థలం కోసం ప్రభుత్వం స్థలం ఇస్తామని నాలుగేళ్ల క్రితం హామీ ఇచ్చిందని, అయినా, ఇప్పటి వరకు ఈ విషయంలో ఎటువంటి పురోగతి లేదని జ్వాల ఆవేదన వ్యక్తం చేసింది. ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని ఈ డబుల్స్ స్టార్ విమర్శించింది.
తెలంగాణ అథ్లెట్లకు ప్రోత్సాహకంగా అప్పట్లో ప్లాట్లు ప్రకటించిందని, అందులో భాగంగానే తనకూ నజరానాలు ప్రకటించిందని పేర్కొన్న జ్వాల ఇప్పటి వరకు అది అందకపోవడం బాధగా ఉందని పేర్కొంది. మంత్రి కేటీఆర్‌కు, సీఎం కార్యాలయానికి ఈ ట్వీట్‌ను ట్యాగ్ చేసింది. అయితే, ఆ తర్వాత కాసేపటికే ఆ ట్వీట్‌ను డిలీట్ చేయడం చర్చనీయాంశమైంది.