Amaravati: చంద్రబాబు పాత్ర పోషించే చాన్స్ రావడమెంతో గౌరవం!: రానా

  • ఇటీవల అమరావతిలో చంద్రబాబుతో రానా భేటీ
  • గొప్ప అవకాశం దక్కింది
  • ట్విట్టర్ లో ధన్యవాదాలు తెలిపిన రానా
ఆంధ్రప్రదేశ్ సీఎంగా నటించే అవకాశం తనకు లభించడం ఎంతో గొప్ప విషయమని హీరో రానా వ్యాఖ్యానించాడు. ఇటీవల బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ తో కలసి అమరావతికి వెళ్లి చంద్రబాబుతో భేటీ అయిన రానా, తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఉదయం స్పందించాడు. "ఎన్టీఆర్ బయోపిక్ లో కీలకమైన చంద్రబాబునాయుడి పాత్రను పోషించే అవకాశం లభించడం నాకు దక్కిన ఎంతో గొప్ప గౌరవం. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు నా ధన్యవాదాలు" అని ట్వీట్ చేశాడు.

 చంద్రబాబుతో భేటీ చిత్రాన్ని, వారి భేటీపై వచ్చిన మీడియా కవరేజ్ చిత్రాలను రానా తన అభిమానులతో పంచుకున్నాడు. కాగా, ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఒక షెడ్యూల్ పూర్తికాగా, వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా, ఎన్టీఆర్ బయోపిక్ విడుదల కానున్న సంగతి తెలిసిందే.
Amaravati
Rana
Twitter

More Telugu News