KCR: కేసీఆర్ సోదరి లీలమ్మ కన్నుమూత!

  • కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లీలమ్మ
  • యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని తిరుగు ప్రయాణమైన కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సోదరి లీలమ్మ ఈ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను, హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ ఆమె మరణించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్, లీలమ్మ మరణవార్తను తెలుసుకుని, హుటాహుటిన హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 21న కేసీఆర్ మరో సోదరి విమలాబాయి కన్నుమూసిన సంగతి తెలిసిందే.
KCR
Sister
Leelamma
Died

More Telugu News