దిల్ రాజు బంపరాఫర్... శ్రావణమాసంలో పెళ్లి చేసుకునే జంటలకు పట్టు వస్త్రాలు!
- 9న విడుదల కానున్న 'శ్రీనివాస కళ్యాణం'
- వెంకటేశ్వరుని వద్ద పూజలు చేసి వస్త్రాలు పంపుతాం
- ఎంపిక చేసిన జంటలకు స్వయంగా వచ్చి ఇస్తాం
- వెడ్డింగ్ కార్డు పంపితే చాలన్న దిల్ రాజు
శ్రావణ మాసంలో పెళ్లిళ్లు జరగబోతున్న జంటలు, తమ వెడ్డింగ్ కార్డును పంపితే సరిపోతుందని, వారికి పట్టు వస్త్రాలను పంపుతామని, కొంతమంది ఎంపిక చేసిన జంటలకు తమ 'శ్రీనివాస కళ్యాణం' టీమ్ స్వయంగా వచ్చి దుస్తులను అందిస్తుందని చెప్పారు. ఏ అడ్రస్ కు వెడ్డింగ్ కార్డును పంపాలన్న విషయాన్ని ఫేస్ బుక్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తామని చెప్పారు. పెళ్లికి ఉండే విలువను గురించి తెలియజెప్పే చిరు ప్రయత్నమే ఇదని దిల్ రాజు వ్యాఖ్యానించారు.