జగన్ సీఎం అయితే డైరెక్టుగా వెళతా... చంద్రబాబే వస్తే సీక్రెట్ గా పని చేయించుకోవాలి: ఉండవల్లి అరుణ్ కుమార్
- వైసీపీ గెలిస్తే తెలిసిన వారే మంత్రులవుతారు
- ఇటీవలి చంద్రబాబుతో కలయిక మర్యాద పూర్వకమే
- ఆయన పిలిస్తేనే వెళ్లానన్న ఉండవల్లి
అయితే, గత నాలుగేళ్లలో చంద్రబాబుతో పనులు చేయించుకోవాల్సిన అవసరం రాలేదని చెప్పిన ఉండవల్లి, ఇటీవల తాను చంద్రబాబును మర్యాద పూర్వకంగానే కలిశానని అన్నారు. ఆయన పిలిస్తేనే తాను వెళ్లానని, చంద్రబాబు అపాయింట్ మెంట్ ను తాను కోరలేదని చెప్పారు. పవన్ కల్యాణ్ ను కూడా ఆయన పిలిస్తేనే వెళ్లి కలిసొచ్చానే తప్ప తనంతట తానుగా వెళ్లలేదని తెలియజేశారు. పవన్ కల్యాణ్ పిలవడాన్ని తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.