విశాఖ కైలాసగిరిపై అదుపు తప్పిన బ్యాటరీ కారు... మహిళ మృతి!
- నగర సందర్శనకు వచ్చిన బెంగళూరు వాసులు
- శివపార్వతుల విగ్రహాల వద్ద కారు బ్రేకులు ఫెయిల్
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజ్యలక్ష్మి మృతి
ఆపై అక్కడి బ్యాటరీ కారు ఎక్కి శివపార్వతుల విగ్రహాలవైపు వెళ్లారు. ఆ సమయంలో కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్, దాన్ని అదుపు చేయాలని ప్రయత్నించి విఫలం అయ్యాడు. అంతలోనే ఆ కారు వేగంగా వెళ్లి, బస్టాప్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాజ్యలక్ష్మికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.