నటుడు సుబ్బరాజు గొప్ప మనసు.. థ్యాంక్స్ చెప్పిన కేటీఆర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నటుడు సుబ్బరాజు గొప్ప మనసు.. థ్యాంక్స్ చెప్పిన కేటీఆర్!

  • ఫ్యామిలీ ఫంక్షన్ లో కేటీఆర్ ను కలిసిన సుబ్బరాజు
  • సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం
  • ఆనందాన్ని వ్యక్తం చేసిన కేటీఆర్
తెలంగాణ మంత్రి కేటీఆర్ ను సినీ నటుడు సుబ్బరాజు ఆశ్చర్యానికి గురి చేశారు. వివరాల్లోకి వెళ్తే, కేటీఆర్ ఓ ఫంక్షన్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న సుబ్బరాజు కేటీఆర్ ను కలిసి... సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాన్ని అందజేశారు. ఈ విషయాన్ని కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. "రాత్రి నేను ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కు వెళ్లా. అదే సమయంలో సుబ్బరాజు నా వైపు వస్తుండటాన్ని చూసి ఆశ్చర్యపోయా. దగ్గరకు వచ్చాక సుబ్బరాజు సీఎం రిలీఫ్ ఫండ్ కు ఓ చెక్ ను ఇచ్చారు. మీ సహృదయానికి చాలా థ్యాంక్స్ బ్రదర్" అంటూ ట్వీట్ చేశారు. అయితే, ఎంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చారనే విషయం మాత్రం తెలియరాలేదు.

దీనిపై నెటిజన్లు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో విలన్ పాత్రలు పోషించినా... రియల్ లైఫ్ లో మాత్రం సుబ్బరాజు హీరో అంటూ ప్రశంసిస్తున్నారు. మరోవైపు హీరో విజయ్ దేవరకొండ కూడా తనకు వచ్చిన ఓ అవార్డును వేలం వేయగా వచ్చిన రూ. 25 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. 
subba raju
KTR
donation
cm releif fund

More Telugu News