మరో రెండు నెలల్లో మూత.. వార్తలపై స్పందించిన జెట్ ఎయిర్వేస్
- వార్తలపై వివరణ కోరిన స్టాక్ఎక్స్చేంజ్
- కావాలని దుష్ప్రచారం చేస్తున్నారన్న జెట్ ఎయిర్వేస్
- మూత వార్తలు నిజం కాదని స్పష్టీకరణ
శుక్రవారం హల్చల్ చేసిన వార్తల ప్రకారం.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే మరో 60 రోజులకు మించి విమానాలను నడిపే పరిస్థితి లేదంటూ జెట్ఎయిర్వేస్ తమ పైలట్లకు చెప్పినట్టు వార్తలు వినిపించాయి. అంతేకాదు, సిబ్బంది వేతనంలో 25 శాతం కోతకు అంగీకరించాల్సి ఉంటుందని, లేకపోతే మొత్తం సంస్థే మూతబడే అవకాశం ఉందని అల్టిమేటం కూడా జారీ చేసినట్టు తెలిసింది. ఈ వార్తలపై స్పందించిన బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ జెట్ఎయిర్వేస్ వివరణ కోరింది. దీంతో స్పందించిన సంస్థ ఆ వార్తల్లో స్పష్టత లేదని తేల్చి చెప్పింది. కొందరు ఉద్దేశపూర్వకంగా వీటిని సృష్టిస్తున్నారని పేర్కొంది.