BJP: 'భర్తలను ఏడిపిస్తున్న భార్యలు పెరుగుతున్నారు' అంటూ లోక్ సభలో నవ్వులు పూయించిన బీజేపీ ఎంపీ!

  • 'పురుష్ ఆయోగ్'ను ఏర్పాటు చేయాలి
  • మహిళల కోసం 'మహిళా ఆయోగ్' ఉంది
  • పురుషులను కష్టాల నుంచి బయట పడేయాలన్న హరినారాయణ్
దేశంలో భర్తలను ఏడిపిస్తున్న భార్యల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, భార్యా బాధితులను ఆదుకునేందుకు 'పురుష్ ఆయోగ్'ను ఏర్పాటు చేయాలని బీజేపీకి చెందిన ఎంపీ హరినారాయణ్ రాజ్ భర్ వ్యాఖ్యానించడం లోక్ సభలో నవ్వులు పూయించింది. జీరో అవర్ లో ఈ విషయాన్ని ప్రస్తావించిన ఆయన, మహిళల కోసం 'మహిళా ఆయోగ్' వంటి కమిషన్లు ఉన్నాయని గుర్తు చేసిన ఆయన, పురుష బాధితుల సంగతేంటని ప్రశ్నించారు.

భార్యల వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని, కొందరు జైలుకు కూడా వెళ్లారని చెప్పారు. అటువంటి వారిని కష్టాల నుంచి బయట పడేసేందుకు 'పురుష్ ఆయోగ్' ను ఏర్పాటు చేయాలని అన్నారు. ఆయన చేసిన డిమాండ్ ను వినగానే మహిళా ఎంపీలతో పాటు ఇతర పార్టీల ఎంపీలు సైతం గట్టిగా నవ్వారు. ఆపై కొందరు ఎంపీలు మరిన్ని సరదా వ్యాఖ్యలు చేయడంతో సభలో కాసేపు ఉల్లాస భరిత వాతావరణం కనిపించింది.
BJP
Lok Sabha
Harinarayan Rajbhar
Purush Aayog

More Telugu News