Rahul Gandhi: అది సింహం తోలు కప్పుకున్న గాడిద లాంటింది: 'మతతత్వం' పై రాహుల్ గాంధీ

  • మతతత్వం ఎలాంటిదో వివరించిన రాహుల్
  • ప్రేమ్ చంద్ జయంతిని గుర్తు చేస్తూ ట్వీట్
  • సంస్కృతి ముసుగులో తన వక్రబుద్ధిని చూపిస్తుందన్న కాంగ్రెస్ చీఫ్
మతతత్వంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మతతత్వం అనేది సంస్కృతి ముసుగులో దూరి తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తుందని అన్నారు. అది సింహం తోలు కప్పుకున్న గాడిదలాంటిదని అభివర్ణించారు. శుక్రవారం రాహుల్ ఓ ట్వీట్‌ చేస్తూ మతతత్వం గురించి ప్రస్తావించారు.

సింహం తోలు కప్పుకున్న గాడిద అడవికి తానే రాజని భావిస్తుందని పేర్కొన్నారు. అసలు రూపాన్ని బయటకు చూపించే సాహసాన్ని అది ఎన్నడూ చేయబోదన్నారు. ప్రస్తుతం మతతత్వం కూడా ఇలానే ప్రవర్తిస్తోందన్నారు. ప్రేమ్‌చంద్ నవలల్లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ప్రముఖ రచయిత ప్రేమ్‌చంద్ 134వ జయంతి (జులై 31)ని పురస్కరించుకుని హిందీలో ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.   
Rahul Gandhi
Congress
Premchand
Twitter

More Telugu News