Biggboss: బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు సడన్ సర్ ప్రైజ్... కాసేపు అలరించి, అమిత్ కు 'పవర్' ఇచ్చిన కమలహాసన్!

  • 'విశ్వరూపం 2' ప్రమోషన్ లో భాగంగా హౌస్ లోకి
  • సరదాగా ఆడి పాడిన కమల్ 
  • రెండు వారాలు ఎలిమినేట్ కాకుండా అమిత్ కు చాన్స్
టాలీవుడ్ బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్ లకు శుక్రవారం నాడు అతిపెద్ద సర్ ప్రైజ్ కమలహాసన్ రూపంలో వచ్చింది. తన నూతన చిత్రం 'విశ్వరూపం 2' ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లో ఉన్న ఆయన, హౌస్ లోకి వచ్చి పోటీదారులతో కాసేపు సరదాగా గడిపారు. సినిమా ట్రైలర్ ను ఇంటి సభ్యులకు చూపించారు. హీరోయిన్ పూజ, మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్, సినిమాటోగ్రాఫర్ దత్ లను కూడా తీసుకు వచ్చి వారిని పరిచయం చేశారు.

కమల్ ను అలరించేందుకు అమిత్, రోల్ రైడా, గీతా మాధురిలు తమ టాలెంట్ ను ప్రదర్శించారు. కమల్ సైతం 'భారతీయుడు' చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ 'అదిరేటి డ్రస్సు మీరేస్తే' పాటకు తనదైన శైలిలో స్టెప్పులేశారు. ఇక వీక్షకులకు అతిపెద్ద సర్ ప్రైజ్ ఏంటంటే, హౌస్ లోని ఒకరికి రెండు వారాల పాటు ఎలిమినేట్ కాకుండా పవర్ ను ఇస్తానని చెప్పిన ఆయన, బాగా ఆడుతున్న వారికి ఈ చాన్స్ ఇవ్వబోనని, కాస్తంత వెనుకబడిన వారికి ఇస్తానని చెబుతూ, ఆ చాన్స్ ను అమిత్ కు ఇచ్చారు. దీంతో సంభ్రమాశ్చర్యాలకు గురైన అమిత్, కమల్ కు కృతజ్ఞతలు తెలిపారు. కమల్ ఇచ్చిన చాన్స్ తో అమిత్ రెండు వారాలు సేఫ్ అయ్యాడన్నమాట.
Biggboss
Vishwaroopam
Kamal Haasan
Nani
Amit

More Telugu News