AICC: ఏఐసీసీ అధికార ప్రతినిధిగా జైపాల్ రెడ్డి నియామకం!

  • ఉత్తర్వులు జారీ చేసిన రాహుల్ గాంధీ
  • కీలక పరిణామంగా చెబుతున్న పరిశీలకులు
  • హర్షం వ్యక్తం చేస్తున్న తెలంగాణ నేతలు
కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డిని ఏఐసీసీ అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2002-2004 మధ్య ఏఐసీసీ ప్రధాన అధికార ప్రతినిధిగా జైపాల్ రెడ్డి వ్యవహరించారు. తాజాగా సార్వత్రిక ఎన్నికలకు ముందు మరోమారు ఆయనను అధికార ప్రతినిధిగా నియమించడం కీలక పరిణామంగా చెబుతున్నారు.

 నిజానికి జైపాల్ రెడ్డికి సీడబ్ల్యూసీ పునర్‌వ్యవస్థీకరణలో చోటు దక్కుతుందని భావించారు. ఏఐసీసీలో కీలక పదవి వస్తుందన్న ప్రచారం కూడా జరిగింది. కాగా, జైపాల్‌ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా నియమితులవడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
AICC
Spokesperson
Jaipal reddy
Telangana
Congress

More Telugu News