Rajamouli: కశింకోటలో సందడి చేసిన రాజమౌళి, రమ!

  • తల్లి పేరిట పాఠశాల భవన నిర్మాణం
  • ప్రారంభించేందుకు వచ్చిన రాజమౌళి దంపతులు
  • స్వాగతం పలికిన ఎమ్మెల్యే పీలా
ఈ ఉదయం విశాఖపట్నం జిల్లా కసింకోటకు వచ్చిన రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళి అక్కడి ప్రజలు, అభిమానులు, చిన్నారులతో కాసేపు సందడి చేశారు. తన తల్లి పేరిట నిర్మించిన పాఠశాల భవనాన్ని ప్రారంభించేందుకు రాజమౌళి దంపతులు రాగా, స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ వారికి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, పిల్లలకు ఆడుకునేందుకు మరింత సమయాన్ని కేటాయించాలని, తరగతి గదుల్లోకన్నా, మైదానంలో ఆడుకునే సమయంలోనే వారు ఎక్కువ నేర్చుకుంటారని అన్నారు. రాజమౌళి, రమా రాజమౌళి వస్తున్నారని తెలుసుకున్న కశింకోట ప్రజలు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని వారిని చూసేందుకు ఆసక్తి చూపారు.
Rajamouli
Rama Rajamouli
Kasimkota
Vizag

More Telugu News