Kamal Haasan: ఫ్యాన్స్ కు ఫీస్ట్... తెలుగు బిగ్ బాస్ హౌస్ లోకి రానున్న కమలహాసన్!

  • విశ్వరూపం 2 ప్రమోషన్ లో కమల్ బిజీ
  • హౌస్ లోకి వచ్చి కాసేపు గడపనున్న కమల్
  • ఆయన చేసే సందడి అభిమానులకు వినోదమే!
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తున్న బిగ్ బాస్ సీజన్ -2 మరో ప్రత్యేకతను సంతరించుకోనుంది. బిగ్ బాస్ హౌస్ లోకి రానున్న ప్రముఖ నటుడు కమలహాసన్, ఇంట్లోని పోటీదారులతో కాసేపు గడపనున్నారు. తన నూతన చిత్రం 'విశ్వరూపం 2' ప్రమోషన్ లో భాగంగా ఆయన హౌస్ లోకి ఎంటర్ అవుతారని తెలుస్తోంది. యూనివర్సల్ స్టార్ గా, ఎన్నో తెలుగు హిట్ చిత్రాల్లో నటించిన కమల్ హౌస్ లో ఎలాంటి సందడి చేస్తారో వేచి చూడాల్సిందే. ఆయన రాక ఫ్యాన్స్ కు మంచి వినోదాన్ని పంచుతుందనడంలో సందేహం లేదు.
Kamal Haasan
Biggboss
Season 2

More Telugu News