1000 కోట్ల సినిమాకి మొదలైన సన్నాహాలు!
- భారీ బడ్జెట్ తో బహు భాషా చిత్రం
- రెండు భాగాలుగా నిర్మాణం
- ఆయా భాషల నుంచి నటీనటులు
మలయాళం వెర్షన్ కి ఇదే టైటిల్ ను ఉంచేసి, తెలుగు .. తమిళ .. హిందీ .. కన్నడ .. వెర్షన్స్ కి మాత్రం 'ది మహాభారత' అనే టైటిల్ పెడదామనే ఆలోచనలో వున్నట్టుగా తెలుస్తోంది. నటీనటులను కూడా ఆయా భాషల నుంచి ఎంపిక చేయనున్నట్టు సమాచారం. రెండు భాగాలు ఈ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. వచ్చే జూలై నుంచి రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టే దిశగా రంగంలోకి దిగినట్టుగా చెబుతున్నారు. 2020లో మొదటి భాగాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట.