రోజుకో మాట చెబుతూ ఇంత మోసమా?: చంద్రబాబుపై రోజా ఫైర్
- అన్ని విభజన హామీలపై మాట మారుస్తున్న సీఎం
- బీజేపీతో లాలూచీ పడి ప్రజల వంచన
- ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టారన్న రోజా
తిరుమలలో జరుగుతున్న విషయాలు ఎక్కడ బయటకు వస్తాయోనన్న భయంతోనే సమాచార హక్కు చట్టం పరిధిలోకి టీటీడీని తేవడానికి చంద్రబాబు అంగీకరించడం లేదని, ఈ విషయంలో తమ పార్టీ పోరాటం చేస్తుందని రోజా తెలిపారు. దేవదేవుని సన్నిధిలో జరుగుతున్న అన్ని అంశాలూ పారదర్శకంగా ఉండాలని, భక్తులకు సమాచారం ఇచ్చేందుకు టీటీడీకి అభ్యంతరం ఎందుకని ఆమె ప్రశ్నించారు. వెయ్యి కాళ్ల మండపాన్ని తిరిగి నిర్మించాలని రోజా డిమాండ్ చేశారు.