కాంగ్రెస్కు షాకిచ్చిన సొంత పత్రిక.. మధ్యప్రదేశ్లో బీజేపీ గెలుపు ఖాయమన్న ‘స్పిక్’ సర్వే.. ప్రచురించిన ‘నేషనల్ హెరాల్డ్’!
- మధ్యప్రదేశ్లో మళ్లీ బీజేపీదే అధికారం
- కాంగ్రెస్-బీఎస్పీ కలవకుంటే బీజేపీకి 147 సీట్లు
- కలిసినా బీజేపీపై ప్రభావం నిల్
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి కలిస్తే కనుక బీజేపీ 126 సీట్లకే పరిమితమవుతుందని, కాంగ్రెస్-బీఎస్పీ కూటమి 103 సీట్లు గెలుచుకుంటుందని సర్వే తేల్చి చెప్పింది. ఒకవేళ కాంగ్రెస్-బీఎస్పీ కూటమి కట్టకుంటే బీజేపీ 147 స్థానాలో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, కాంగ్రెస్కు 73 స్థానాలే వస్తాయని అంచనా వేసింది.
మరోవైపు, మోదీ అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తి అని సర్వే పేర్కొంది. మోదీకి 41 శాతం మంది ఓటేయగా, రాహుల్ గాంధీ 9.72 శాతంతో ఈ జాబితాలో రెండోస్థానంలో నిలిచారు.