దిల్ రాజు నిర్మాతగా బన్నీ హీరోగా 'సభకు నమస్కారం'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దిల్ రాజు నిర్మాతగా బన్నీ హీరోగా 'సభకు నమస్కారం'

  • బన్నీకి కథ వినిపించిన దిల్ రాజు 
  • కథ బాగుందన్న బన్నీ 
  • దర్శకుడి ఎంపిక గురించిన చర్చలు  
నిర్మాతగా దిల్ రాజు వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నారు. మాస్ ఆడియన్స్ ను .. యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఆయన విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నారు. యువ దర్శకులను ప్రోత్సహిస్తూ కథకి తగిన నాయకా నాయికలను తీసుకుంటున్నారు. అలాంటి దిల్ రాజు బన్నీ హీరోగా ఒక సినిమా చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది.

నాని హీరోగా దిల్ రాజు ఒక సినిమా చేయాలనుకున్నారు. ఈ సినిమాకి 'సభకు నమస్కారం' అనే టైటిల్ ను కూడా సెట్ చేసుకున్నారు. నానీ బిజీగా ఉండటం .. మంచి కథ కోసం అల్లు అర్జున్ వెయిట్ చేస్తుండటంతో, ఈ కథను బన్నీకి వినిపించారట దిల్ రాజు. కథ నచ్చడంతో బన్నీ ఓకే అనేశాడని సమాచారం. ఈ ప్రాజెక్టుని ఏ దర్శకుడికి అప్పగించాలనే విషయంపైనే చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుందని చెబుతున్నారు.  
Allu Arjun
dil raju

More Telugu News