భారీ గ్రాఫిక్స్ తో ఉత్కంఠను రేపనున్న 'సువర్ణ సుందరి'

  • విజువల్ వండర్ గా 'సువర్ణ సుందరి'
  • ప్రధానమైన పాత్రల్లో పూర్ణ .. జయప్రద 
  • సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు
ఈ తరం ప్రేక్షకులు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. తాము ఆశిస్తోన్న కొత్తదనం కలిగిన సినిమాలనే వాళ్లు ఆదరిస్తున్నారు. అందువలన కొత్తగా .. వైవిధ్యంగా అనిపించే కథలనే దర్శక నిర్మాతలు ఎంచుకుంటున్నారు. ఆసక్తికరమైన కథనంతో ప్రేక్షకులలో ఉత్కంఠను రేకెత్తిస్తున్నారు. అలా దర్శకుడు సూర్య రూపొందించిన 'సువర్ణ సుందరి' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

'చరిత్ర .. భవిష్యత్తును వెంటాడుతుంది' అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. టైటిల్ ను బట్టే ఇది నాయికా ప్రాధాన్యత కలిగిన చిత్రమని తెలిసిపోతోంది. ఈ సినిమాలో ఈ తరం కథానాయిక పూర్ణ నటించగా, ఆమె కూతురు పాత్రలో .. నిన్నటి తరం కథానాయిక జయప్రద నటించడం విశేషం. ఇతర ముఖ్య పాత్రల్లో  సాక్షి చౌదరి .. సాయికుమార్ .. కోట శ్రీనివాసరావు కనిపించనున్నారు. విజువల్ వండర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దామనీ .. సెప్టెంబర్లో విడుదల చేయనున్నామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.     
Go Back to Shorts
jayaprada
poorna

More Telugu News