యాదాద్రి లాడ్జీలపై ఏకకాలంలో దాడులు... వ్యభిచారానికి వచ్చిన 8 జంటల అరెస్ట్!
- గుట్టలో పెరిగిన అసాంఘిక కార్యకలాపాలు
- పలు లాడ్జీలపై ఒకేసారి దాడులు చేసిన పోలీసులు
- రూములిచ్చిన యజమానుల పైనా కేసులు
శ్రీలక్ష్మీనరసింహ లాడ్జి, శ్రీధ లాడ్జిలో ఒక్కో జంట చొప్పున, ఎస్ఎన్ లాడ్జిలో, శ్రీ లక్ష్మీలాడ్జిలో మూడు జంటల చొప్పున అదుపులోకి తీసుకున్నామని పోలీసు అధికారులు తెలిపారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన జంటలు ఇక్కడి లాడ్జీల్లో రూములు తీసుకుని వ్యభిచారానికి పాల్పడుతుండగా, ఎన్ని కేసులు పెట్టినా అసభ్య కార్యక్రమాలకు మాత్రం బ్రేక్ పడటం లేదు. ఇక భువనగిరిలోని లాడ్జీల్లో సైతం అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని ఆరోపణలు వస్తుండటంతో వాటిపైనా దృష్టిని సారించనున్నామని తెలిపారు.