ఇక ఫైనల్ వాదనలు... బ్రిటన్ కోర్టు ముందుకు నేడు మాల్యా!
- నేడు మాల్యా అప్పగింతపై తుది విచారణ
- తీర్పు తేదీని కూడా ప్రకటించనున్న జడ్జి
- ఏడాది నుంచి బెయిల్ పై ఉన్న మాల్యా
ఇండియాలో ప్రముఖ బ్యాంకుల నుంచి రూ. 9 వేల కోట్లను అప్పుగా తీసుకుని ఎగ్గొట్టిన మాల్యాను తమ దేశానికి అప్పగించాలని భారత్ కోరుతున్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం ఏప్రిల్ లో మాల్యాను బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేయగా, అప్పటి నుంచి ఆయన బెయిల్ పై ఉన్నారు. నేటి తుది వాదనల తరువాత, తీర్పు కోసం ఓ తేదీని జడ్జి నిర్ణయిస్తారని క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్ కు చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు.