శుక్రవారం నాడు ఇల్లొదిలి వెళ్లిన యువతి... సోమవారం నాడు బావిలో విగతజీవిగా.. చిత్తూరు జిల్లాలో ఘటన!
- చిత్తూరు జిల్లా రెడ్డిగుంటలో కలకలం
- పోలీసులు వెతుకుతుంటే మృతదేహమై కనిపించిన సంగీత
- ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం
ఈ నేపథ్యంలో రెడ్డిగుంట శివారులోని ఓ బావిలో మృతదేహం పైకి తేలిందంటూ పోలీసులకు సమాచారం అందడంతో, వారు వెళ్లి ఆ మృతదేహం సంగీతదేనని తేల్చి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. సంగీత ఓ యువకుడిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నట్టు స్థానికులు చెప్పడంతో, ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఆమె మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని బంధువులు చెప్పడంతో పోలీసులు ఆ దిశగా దర్యాఫ్తు ప్రారంభించారు.