జగన్! వైఎస్ సీఎం కాకముందు అప్పులోళ్లు మీ వెంటబడింది వాస్తవం కాదా?: ఏపీ మంత్రి దేవినేని ఉమ

జగన్ తన సొంత మీడియాతో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘జగన్.. అటూఇటూ కాకుండా మూడో జాతిలా వ్యవహరించొద్దు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ ఈరోజున అనుభవిస్తున్న ఆస్తులన్నీ ప్రజాధనమేనని, వైఎస్ రాజశేఖరెడ్డి సీఎం కాకముందు అప్పులోళ్లు మీ వెంటబడింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు దోచుకున్న అవినీతిపరుడు జగన్ అని మండిపడ్డారు.

‘పోలవరం’ పనులకు సంబంధించి జగన్ లేనిపోని ఆరోపణలు చేయడం తగదని, ఇప్పటికే యాభై వేల మంది రైతులు, విద్యార్థులు సందర్శించారని, ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని చూస్తేనైనా ఆయనకు జ్ఞానం వస్తుందని, కానీ, అది చూసే అదృష్టం ఆయనకు లేదులే అంటూ విమర్శించారు. కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు పెట్టిన జగన్ కు సీఎం కావాలనే పిచ్చిపట్టుకుందని అన్నారు.


More Telugu News