Narendra Modi: విదేశాల నుంచి డైరెక్టుగా లక్నోలో ల్యాండ్ అయిన నరేంద్ర మోదీ!

  • నాలుగు రోజుల పాటు మూడు దేశాల్లో పర్యటించిన మోదీ
  • లక్నో చేరుకున్న ప్రధాని
  • స్వాగతం పలికిన యోగి ఆదిత్యనాథ్ తదితరులు
నాలుగు రోజుల పాటు రువాండా, ఉగాండా, దక్షిణాఫ్రికా దేశాల్లో పర్యటించి, బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి భారత్ చేరుకున్నారు. జొహనస్ బర్గ్ నుంచి ఆయన నేరుగా లక్నో చేరుకున్నారు. లక్నో ఎయిర్ పోర్టులో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర హోమ్ మంత్రి, ఇతర ఉన్నతాధికారులు మోదీకి స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు ఉత్తర ప్రదేశ్ లో పర్యటించనున్న ఆయన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రారంభించనున్నారు. లక్నోలో జరిగే 'ట్రాన్స్ ఫర్మేషన్ అర్బన్ లాండ్ స్కేపింగ్' సదస్సుకు హాజరై ప్రసంగిస్తారు. ప్రధాని పర్యటన సందర్భంగా రాష్ట్రంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Narendra Modi
Lucknow
Uttar Pradesh
India
Brics

More Telugu News