Amit shah: టీడీపీని అడుక్కోం.. పొత్తుపై తేల్చేసిన అమిత్ షా!

  • పొత్తు కోసం టీడీపీని సంప్రదించబోం
  • కొత్త పొత్తులు ఉంటాయి
  • శివసేన ఇప్పటికీ మాతోనే ఉంది
వచ్చే ఎన్నికల్లో కొత్త పార్టీలతో పొత్తు పెట్టుకుంటాం తప్ప టీడీపీని మాత్రం అడుక్కోబోమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తేల్చి చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కోసం సంప్రందించే ప్రసక్తే లేదన్నారు. పొత్తు పునరుద్ధరించాలంటూ టీడీపీ దగ్గరికి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. భాగస్వామ్య పక్షాలను బీజేపీ చిన్న చూపు చూస్తోందన్న వార్తలను అమిత్ షా ఖండించారు. మిత్రపక్షాలకు గౌరవం ఇవ్వడం లేదని, చిన్నచూపు చూస్తోందని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.

శివసేన ఇప్పటికీ తమతోనే ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా అమిత్ షా గుర్తు చేశారు. వారు తమతోనే ఉంటున్నప్పుడు, వారనే మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేసిన అమిత్ షా, కొత్త పొత్తులు కుదుర్చుకునే అవకాశం ఉందన్నారు.
Amit shah
BJP
Telugudesam
Chandrababu
Andhra Pradesh

More Telugu News