Andhra Pradesh: తెలుగు రాష్ట్రాలకు నీటి విడుదల ఉత్తర్వులు జారీ

  • ఏపీకి 25 టీఎంసీలు, తెలంగాణకు 30 టీఎంసీలు  
  • శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల ద్వారా విడుదల కానున్న నీరు
  • కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఉత్తర్వులు
తెలుగు రాష్ట్రాలకు నీటి విడుదల ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీకి 25 టీఎంసీలు, తెలంగాణకు 30 టీఎంసీలు విడుదల కానున్నాయి. ఈ మేరకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఉత్తర్వలు జారీ చేసింది.  

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణకు..

కల్వకుర్తి ద్వారా 10 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ కు.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 9 టీఎంసీలు, హంద్రీనీవా ద్వారా 5 టీఎంసీలు విడుదల కానున్నాయి.

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి తెలంగాణకు ..


హైదరాబాద్, నల్గొండ తాగునీటి అవసరాలకు 6 టీంఎంసీలు, మిషన్ భగీరథకు 2 టీఎంసీలు, నాగార్జున సాగర్ ఎడమ కాలువకు 12 టీఎంసీలు విడుదల కానున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి.. నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా 7.50 టీఎంసీలు, ఎడమ కాలువ ద్వారా 3.50 టీఎంసీలు విడుదల కానున్నాయి. రేపటి నుంచి ఆగస్టు 22 వరకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున విడుదల చేసేందుకు బోర్డు ఆదేశాలిచ్చింది.
Andhra Pradesh
Telangana

More Telugu News