Pawan Kalyan: జగన్మోహన్ రెడ్డి గారు! మీరు బాబును ఎదుర్కోలేకనే అసెంబ్లీ నుంచి పారిపోతున్నారు: పవన్ కల్యాణ్

  • పారిపోవద్దు.. చంద్రబాబుని ఎదుర్కోండి 
  • నేనే కనుక మీ స్థానంలో ఉంటే ఓ ఊపు ఊపేసేవాడిని
  • మీరు ప్రజాస్వామ్య వ్యవస్థను వాడుకోవట్లేదు
వైసీపీ అధినేత జగన్ పై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి విరుచుకుపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ‘జగన్మోహన్ రెడ్డి గారికి చెబుతున్నా.. చంద్రబాబుగారిని ఎదుర్కొనే శక్తి, దమ్మూ ధైర్యం లేకే మీరు అసెంబ్లీ నుంచి పారిపోతున్నారు. చంద్రబాబు గారిని ఎదుర్కోండి.

నేనే కనుక మీ స్థానంలో ఉండి ఉంటే.. ప్రభుత్వాన్ని ఓ ఊపు ఊపేసేవాడిని. ప్రతిపక్షనాయకుడికి ఉన్న శక్తి మీకేమి తెలుసు? మీరు ప్రజాస్వామ్య వ్యవస్థను వాడుకోవట్లేదు. ఆ విషయాలపై నేను మాట్లాడుతుంటే నాపై వ్యక్తిగత విమర్శలా? పవన్ కల్యాణ్ జీవితం తెరిచిన పుస్తకం. ఏదీ దాయడు. చాలా మంది జీవితాల్లో కనిపించని పేజీలు ఉంటాయి. నా జీవితం అలా కాదు.. దాపరికాలు లేవు.. తెరిచిన పుస్తకమే’ అని పవన్ అన్నారు.
Pawan Kalyan
Jagan
Chandrababu

More Telugu News