bjp: నేను తలచుకుంటే సీఎంను అయిపోతా: బీజేపీ ఎంపీ హేమమాలిని

  • సీఎం అయితే చాలా ఆసక్తులను కోల్పోవాల్సి వస్తుంది
  • స్వేచ్ఛ హరించుకుపోతుంది 
  • అందుకే, ఆ పదవిని తాను కోరుకోవడం లేదు
ఉత్తరప్రదేశ్ లోని మధుర బీజేపీ ఎంపీ, ప్రముఖ సినీ నటి హేమమాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను తలచుకుంటే నిమిషంలో సీఎంను కాగలను. అయితే, ఆ పదవిపై నాకు వ్యామోహం లేదు’ అన్నారు. సీఎం అయితే చాలా ఆసక్తులను కోల్పోవాల్సి వస్తుందని, స్వేచ్ఛ హరించుకుపోతుందని, అందుకే, ఆ పదవిని తాను కోరుకోవడం లేదని స్పష్టం చేశారు.

బాలీవుడ్ ‘డ్రీమ్ గార్ల్’ గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం వల్లే తాను రాజకీయాల్లోకి రాగలిగానని చెప్పారు. తాను ఎంపీ కావడానికి ముందే బీజేపీ తరపున చేయాల్సిన మంచి పనులన్నీ చేసేశానని అన్నారు. గత నాలుగేళ్లుగా తన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని చెప్పిన హేమమాలిని, ప్రధాని మోదీ, ఆయన పాలనపై ప్రశంసలు కురిపించారు. 
bjp
Hema Malini

More Telugu News