new delhi: రేపు ఏపీ భవన్ ప్రత్యేక వెబ్ సైట్ ప్రారంభం

  • ఏపీ భవన్ కు ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ సైట్
  • రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం
  • రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ వెల్లడి
న్యూఢిల్లీ లోని ఆంధ్రప్రదేశ్ భవన్ కు ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ సైట్ ‘ఏపీభవన్.ఇన్’ ను రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభించనున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో వివిధ అవసరాలు, వివిధ మంత్రిత్వ శాఖలు, కార్యాలయ పనుల నిమిత్తం ఇక్కడకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే అధికారులు, సిబ్బందికి ఏపీ భవన్ అతిథి గృహంలో తాత్కాలిక వసతి కల్పిస్తున్నట్టు చెప్పారు.

అతిథులకు అసౌకర్యం కలగకుండా ముందస్తుగా వసతి సౌకర్యం ఏర్పాటు చేసే సంకల్పంతోనే ఈ ప్రత్యేక వెబ్ సైట్ ‘ఏపీభవన్.ఇన్’ ను రూపొందించినట్లు ప్రవీణ్ ప్రకాష్ పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చే అధికారులు, సిబ్బంది తమ ప్రయాణ తేదీ, వసతి అవసరాలను ముందస్తుగా వెబ్ సైట్ లో పొందుపరిస్తే, ఆ వివరాల సమాచారాన్ని రాష్ట్ర రాజధాని అమరావతిలోని సచివాలయ సాధారణ పరిపాలన విభాగానికి అనుసంధానించి వారి సమన్వయంతో వసతి కల్పించనున్నట్లు పేర్కొన్నారు.  
new delhi
Andhra Pradesh bhavan

More Telugu News