ముస్లిం యజమాని కూతుర్ని ప్రేమించిన పనివాడు... కొట్టి చంపిన వైనం!

  • రాజస్థాన్ లోని జైపూర్ లో ఘటన
  • ముస్లిం యువతితో స్నేహం చేసిన పనివాడు
  • పొలానికి తీసుకెళ్లి కొట్టి చంపిన వైనం
  • ఇద్దరిని అరెస్ట్ చేశామన్న పోలీసులు
తాను పనిచేసే ఇంటి యజమాని కుమార్తెను ప్రేమించిన పాపానికి ఓ యువకుడిపై దాడి చేసి దారుణంగా కొట్టి చంపిన ఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, కేత్ రామ్ భీమ్ (22) అనే యువకుడు మెహబూబ్ ఖాన్ అనే వ్యక్తి ఇంట్లో పనికి కుదిరాడు. ఆ కుటుంబంలో ఉన్న ఓ యువతితో స్నేహం చేశాడు. వారి స్నేహం ప్రేమకు దారితీసింది. ఈ నేపథ్యంలో అతన్ని పలుమార్లు యజమాని హెచ్చరించినా వినలేదు. ఈ క్రమంలో అతని మృతదేహం ఓ పొలంలో దొరికింది. కేత్ రామ్ సోదరుడు హరిరామ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

పొలానికి రావాలని ఇంట్లో ఉండే హయత్ ఖాన్, సదామ్ ఖాన్ లు కేత్ రామ్ ను పిలిచారని, అప్పటికే పొలంలో ఉన్న మరికొందరితో కలసి అతని చేతులు కట్టేసి దారుణంగా కొట్టి చంపారని హరిరామ్ తన ఫిర్యాదులో ఆరోపించారు. పోస్ట్ మార్టం రిపోర్టులో సైతం దారుణమైన గాయాల కారణంగా కేత్ రామ్ మరణించినట్టు తేలడంతో, ఇద్దరు నిందితులనూ అరెస్ట్ చేశామని, కేసును విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Hindu
Muslim
Rajasthan
Murder
Lover
Love
Muslim Girl

More Telugu News