ఇస్లాంలో ఆవు మాంసం తినడం నిషిద్ధం: యూపీ షియా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ వసీం రిజ్వీ

  • ముస్లింలు ఆవు మాంసం తినడాన్ని ఆపేయాలి
  • గోహత్యలు ఆగినప్పుడే దాడులు నిలిచిపోతాయి
  • ఆవులను చంపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
ఇటీవలి కాలంలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్న యూపీ షియా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ వసీం రిజ్వీ మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేశారు. ముస్లింలంతా ఆవు మాంసం తినడం మానేయాలని ఆయన కోరారు. గోహత్యలను ఆపేసినప్పుడే మూకుమ్మడి దాడులు నిలిచిపోతాయని చెప్పారు. హిందువులు గోమాతగా పూజించే ఆవులను చంపడం సాక్షాత్తు తల్లిని చంపడమేనని ఆరెస్సెస్ నేత ఇంద్రేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సరైనవేనని అన్నారు. ముస్లింలు ఆవు మాంసాన్ని తినడాన్ని ఆపినప్పుడే గోవధకు తెర పడుతుందని చెప్పారు. ఇస్లాంలో ఆవు మాంసం తినడం నిషిద్ధమని తెలిపారు. గోహత్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
Go Back to Shorts
cow
meat
muslims
wasim rizvi

More Telugu News