manchu lakshmi: ఎన్నో అవమానాలు ఎదురైనా మా నాన్న నిలదొక్కుకున్నారు: మంచు లక్ష్మి

  • మా నాన్నను ఉద్యోగాల్లో నుంచి తీసేశారు 
  • నటుడు కాలేడంటూ అవమానించారు 
  • అయినా ఆయన నిలదొక్కుకున్నారు
మంచు లక్ష్మి నటిగా మరింత గుర్తింపు తెచ్చుకోవడానికి విభిన్నమైన పాత్రలను చేస్తూ వెళుతున్నారు. అలాంటి మంచు లక్ష్మి తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. "సినిమాల్లోకి రావడానికి ముందు మా నాన్న చాలా అవమానాలను ఎదుర్కొన్నారు. కులం ప్రస్తావన తెస్తూ ఆయనను ఉద్యోగాల్లో నుంచి తీసేసిన సందర్భాలు వున్నాయి.

 ఇంత పొడుగ్గా వున్నావ్ .. నువ్వేం యాక్టర్ వి అవుతావ్? అంటూ నిరుత్సాహ పరిచినవాళ్లు చాలామంది వున్నారు. కష్టపడి ఆయన ఆ విమర్శలను తిప్పికొట్టారు. కొంతమంది అవమానించారని చెప్పేసి నిరాశపడిపోయి ఆ రోజున ఆయన ఊరెళ్లిపోయి వ్యవసాయం చేసుకుందామనుకుని వుంటే కనుక, ఈ రోజున మేము ఇక్కడ ఉండేవాళ్లం కాదు. తన ఫ్యామిలీకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలనే పట్టుదలతో ఆయన నిలదొక్కుకున్నారు. మా నాన్న నాకు ఇచ్చిన లైఫ్ ను నేను నా కూతురికి ఇవ్వాలని అనుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు.         
manchu lakshmi

More Telugu News