vijayasai reddy: ప్రత్యేక హోదా విషయంలో ఆ మూడు పార్టీలు ముద్దాయిలే!: విజయసాయిరెడ్డి

  • ప్రత్యేక హోదా సంజీవని అని టీడీపీ నమ్మడం లేదు
  • హోదా సంజీవని అని మేము నమ్ముతున్నాం
  • ఏపీకి హోదా ఇవ్వకపోవడం సబబు కాదు
ఏపీకి ప్రత్యేక హోదా సంజీవని అని టీడీపీ నమ్మడం లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విభజన హామీలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం సబబు కాదని, హోదా కోసం గత నాలుగేళ్లుగా వైసీపీ పోరాడుతోందని అన్నారు.

 ప్రత్యేక హోదా సంజీవని అని వైసీపీ, కమ్యూనిస్ట్ పార్టీ, జనసేన పార్టీ నమ్ముతున్నాయని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి మొదటి ముద్దాయి బీజేపీ అని, రెండో ముద్దాయి టీడీపీ అని, మూడో ముద్దాయి కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తర్వాతి ప్రభుత్వాలు గౌరవించాలని కోరారు. 14వ ఆర్థిక సంఘం వంకతో బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం సబబు కాదని అన్నారు. 
vijayasai reddy
Rajya Sabha

More Telugu News