Hyderabad: మహిళ స్నానం చేస్తుంటే బాత్రూం రంధ్రంలోంచి వీడియో.. నిందితుడికి అరదండాలు

  • మహిళను లోబర్చుకునేందుకు యత్నం
  • హెచ్చరించడంతో రహస్యంగా వీడియో చిత్రీకరణ
  • పోలీసులకు ఫిర్యాదు
పక్కింటి మహిళ స్నానం చేస్తుంటే బాత్రూంకు ఉన్న రంధ్రం ద్వారా వీడియో తీసిన ప్రబుద్ధుడికి పోలీసులు అరదండాలు వేశారు. హైదరాబాద్‌లోని మల్కాజిగిరిలో జరిగిందీ ఘటన. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివసించే ఫారుఖీ పాషా (31) మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. తన ఇంటి పక్కన నివసించే వివాహితపై కన్నేసిన పాషా ఆమెను లోబర్చుకునేందుకు పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. అతడి ప్రవర్తనను గమనించిన బాధిత మహిళ పలుమార్లు అతడిని హెచ్చరించింది. అయినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు.

తాజాగా శుక్రవారం ఆమె స్నానం చేస్తుండగా, స్నానాల గదికి ఉన్న రంధ్రం ద్వారా సెల్‌ఫోన్‌తో వీడియో తీశాడు. స్నానం పూర్తిచేసి బయటకు వస్తుండగా పారిపోతున్న పాషాను చూసిన ఆమె అనుమానంతో కేకలు వేసింది. తాను స్నానం చేస్తుండగా వీడియో తీశాడంటూ పాషాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Hyderabad
Cellphone
video
women

More Telugu News