Andhra Pradesh: వైసీపీ బంద్: రాష్ట్రవ్యాప్తంగా పలువురు నేతల అరెస్ట్!

  • ప్రత్యేక హోదా కోసం వైసీపీ బంద్
  • రోడ్లపై నేతల ఆందోళన
  • బాలినేని హౌస్ అరెస్ట్  
వైసీపీ చేపట్టిన బంద్ సందర్భంగా పోలీసులు పలువురు నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైసీపీ నేడు రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తోంది. రోడ్డుపైకి వచ్చిన నేతలు కాలేజీ, స్కూలు, వ్యాపార సంస్థలను మూసివేయించారు. ఆర్టీసీ బస్సులు రోడ్లపైకి రాకుండా అడ్డుకుంటున్నారు. రోడ్డుపై ఆందోళన నిర్వహిస్తున్న పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

తిరుపతిలో భూమన కరుణాకర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలులో బీవై రామయ్య, హఫీజ్ ఖాన్, తెర్నకల్ సురేంద్రను అదుపులోకి తీసుకున్నారు. ఒంగోలులో వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. పులివెందులలో వైఎస్‌ వివేకానందరెడ్డిని, విజయవాడలో పార్థసారథి, యలమంచిలి రవిని అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ దగ్గర బైఠాయించి ఆందోళనకు దిగిన వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Andhra Pradesh
YSRCP
Bandh
Arrest

More Telugu News