amit shah: లతా మంగేష్కర్ తో అమిత్ షా సుదీర్ఘ భేటీ!

  • లతకు బీజేపీ విజయాలను వివరించిన అమిత్ షా
  • ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయాలని విన్నపం
  • భేటీలో పాల్గొన్న మహా సీఎం దేవేంద్ర ఫడ్నవిస్
2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా దేశంలోని ప్రముఖులతో భేటీ అవుతున్నారు. బీజేపీకి మద్దతు కోరుతున్నారు. తాజాగా, ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ను ముంబైలోని ఆమె నివాసంలో అమిత్ షా కలిశారు. ఈ సందర్భంగా సుదీర్ఘంగా ఆమెతో చర్చలు జరిపారు.

ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయాలని కోరారు. నాలుగేళ్ల కాలంలో బీజేపీ సాధించిన విజయాలను ఈ సందర్భంగా అమిత్ షా ఆమెకు తెలిపారు. బీజేపీ విజయాల గురించి ఉన్న పుస్తకాన్ని ఆమెకు బహూకరించారు. ఈ భేటీలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, బీజేపీ రాష్ట్ర చీఫ్ రాసా సాహెబ్, మరోనేత అశీష్ షెల్లర్ లు కూడా పాల్గొన్నారు. వాస్తవానికి జూన్ 6నే లతా మంగేష్కర్ తో అమిత్ షా భేటీ కావాల్సి ఉంది. కానీ, ఆ సమయంలో ఆమె ఫుడ్ పాయిజన్ తో బాధపడుతుండటం వల్ల వీరి భేటీ జరగలేదు.
amit shah
latha mangeshkar
devendra fadnavis
meeting

More Telugu News