Narendra Modi: మోదీ ఆసుపత్రికి వెళ్లి మెడికల్ టెస్ట్ చేయించుకోవాలి: 'రాహుల్ ఆలింగనం'పై సుబ్రహ్మణ్యస్వామి

  • ప్రధాని ఇబ్బంది పడేలా రాహుల్ వ్యవహరించారు
  • ఇది అనైతికమైన చర్య
  • ఇలాంటి ఘటన మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలి
లోక్ సభలో ప్రధాని మోదీని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆలింగనం చేసుకున్న ఘటనపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీ వెంటనే ఆసుపత్రికి వెళ్లి, వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రధానమంత్రికి ఇబ్బంది కలిగే విధంగా రాహుల్ ప్రవర్తించారని ఆయన అన్నారు.

పార్లమెంటు లోపల ప్రధానికి ఉన్న రక్షణ గురించి ఈ ఘటన ఏం చెబుతుందని ప్రశ్నించారు. ముమ్మాటికీ ఇది అనైతిక చర్య అని, ఇలాంటి చర్యలను అందరూ ఖండించాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని చెప్పారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా తన ప్రసంగాన్ని ముగించిన రాహుల్ గాంధీ... నేరుగా ప్రధాని వద్దకు వెళ్లి, ఆయనను ఆలింగనం చేసుకున్న సంగతి తెలిసిందే.

Narendra Modi
Rahul Gandhi
subrahmanian swamy
hug

More Telugu News