చెన్నైలో కూలిన భవనం.. ఒకరి మృతి!
- కండంచవాడి ప్రాంతంలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం
- ఒకరు మృతి.. 17 మందికి గాయాలు
- కొనసాగుతున్న సహాయక చర్యలు
సమాచారం అందుకున్న వెంటనే 8 అంబులెన్సులు, 3 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. శిథిలాల కింద చిక్కుకున్న 23 మందిని రక్షించారు. రక్షించిన వారిలో ఐదుగురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్టు చెన్నై కలెక్టర్ పొన్నియన్ తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు చెప్పారు.