Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మెగా ఫ్యాన్స్ కి ఒకే రోజున డబుల్ ధమాకా

  • ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు 
  • 'సైరా' నుంచి రానున్న ఫస్టులుక్ 
  • చరణ్ మూవీ నుంచి ఫస్టులుక్  
ఆగస్టు 22వ తేదీ చిరంజీవి పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. చిరంజీవి పుట్టినరోజు అంటే .. అభిమానులకు పండుగ రోజే. ఆ రోజున మెగా అభిమానులంతా మెగాస్టార్ ఫ్యామిలీపై తమకి గల అభిమానాన్ని చాటుతూ వుంటారు. వాళ్లలో మరింత ఆనందాన్ని నింపడానికి మెగా హీరోలు తమవంతు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక ఈ సారి చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు డబుల్ ధమాకా దక్కనున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి కెరియర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతోన్న 'సైరా' నుంచి ఆగస్టు 22వ తేదీన ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక బోయపాటి దర్శకత్వంలో చరణ్ ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి ఇంతవరకూ టైటిల్ ను ఖరారు చేయలేదు. చిరంజీవి పుట్టినరోజున టైటిల్ తో కూడిన ఫస్టులుక్ ను రిలీజ్ చేయాలని టీమ్ భావిస్తోందట. ఇలా ఒకే రోజున చిరంజీవి .. చరణ్ సినిమాల నుంచి ఫస్టులుక్స్ రానున్నాయనే మాట బలంగా వినిపిస్తోంది.        
chiranjeevi
charan

More Telugu News