అజారుద్దీన్ కు సవాల్ విసిరిన అంజన్ కుమార్ యాదవ్
- సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన అజార్
- దమ్ముంటే పోటీ చేయాలన్న అంజన్ కుమార్ యాదవ్
- సికింద్రాబాద్ స్థానాన్ని వదలబోనంటూ ఆగ్రహం
అంజన్ ను సముదాయించేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నా... ఆయన తగ్గలేదు. దీంతో, అంజన్ మాట్లాడుతుండగానే సమావేశం నుంచి సీనియర్ నేత వి.హనుమంతరావు వెళ్లిపోయారు. మరోవైపు ఈ సమావేశానికి ముఖేష్ గౌడ్, ఆయన కుమారుడు విక్రమ్ గౌడ్ లు గైర్హాజరయ్యారు. వీరిద్దరూ టీఆర్ఎస్ లో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.