నిజమైన ప్రేమను గురించి తెలిస్తేనే ఈ సినిమాకి రండి: 'పరిచయం' దర్శకుడు
- లక్ష్మీకాంత్ దర్శకుడిగా 'పరిచయం'
- నాయకా నాయికలుగా విరాట్ .. సిమ్రత్
- ఈ నెల 21వ తేదీన భారీస్థాయి రిలీజ్
ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో లక్ష్మీకాంత్ మాట్లాడుతూ .. "ఇంతవరకూ నిజమైన ప్రేమలో పడ్డారా .. ప్రేమించి వుంటేనే నా సినిమాకి రండి .. నిజమైన ప్రేమను గురించి తెలిస్తేనే ఈ సినిమాకి రండి. బైకులపై తిరుగుతూ .. బీచ్ లలో విహరిస్తూ అదే ప్రేమ అని భ్రమపడేవాళ్లు నా సినిమాకి రావద్దు. ఎందుకంటే అలాంటి వాళ్ల కోసం ఈ సినిమా తీయలేదు" అని చెప్పుకొచ్చారు.