allu arjun: వారాహి చలన చిత్రం బ్యానర్లో అల్లు అర్జున్!

  • వారాహి బ్యానర్లో వచ్చిన 'విజేత'
  • తొలి రోజునే సక్సెస్ టాక్ సొంతం 
  • మనసులో మాట చెప్పిన అల్లు అర్జున్ 
అల్లు అర్జున్ తన తాజా చిత్రం షూటింగుకి రెడీ అవుతున్నాడు. ఆయన తాజా చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనుల్లోనే విక్రమ్ కుమార్ బిజీగా వున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలోనే వారాహి చలన చిత్రం బ్యానర్లో తెరకెక్కిన 'విజేత' సినిమా .. సక్సెస్ టాక్ ను తెచ్చుకుంది.

మొదటి నుంచి కూడా వారాహి బ్యానర్ కి మంచి పేరుంది. లాభాల మాట అటుంచితే .. మంచి సినిమాలుగా అవి మార్కులు కొట్టేశాయి. అందువలన ఈ బ్యానర్లో చేయాలని ఉందంటూ తాజాగా అల్లు అర్జున్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. తప్పకుండా చేస్తానన్న నమ్మకం కూడా ఉందంటూ మరీ ఆసక్తిని చూపించాడు. హీరోగా అల్లు అర్జున్ కి గల క్రేజ్ ను గురించి .. ఆయనకి గల మార్కెట్ గురించి తెలిసిందే. అందువలన త్వరలోనే సాయి కొర్రపాటి అల్లు అర్జున్ తో ఒక సినిమాను ప్లాన్ చేసే ఛాన్స్ ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది.    
allu arjun
sai korrapati

More Telugu News