Kiran Bedi: కిరణ్ బేడి వివాదాస్పద ట్వీట్... నెటిజన్ల ట్రోలింగ్!

  • వరల్డ్ కప్ ఫుట్ బాల్ గెలిచిన ఫ్రాన్స్
  • 'మేము పుదుచ్చేరియన్లం' అంటూ కిరణ్ బేడి ట్వీట్
  • పబ్లిసిటీ స్టంట్లు ఆపాలంటున్న నెటిజన్లు
గత రాత్రి ఫ్రాన్స్, క్రొయేషియా మధ్య జరిగిన వరల్డ్ కప్ ఫుట్ బాల్ ఫైనల్ సమరంలో ఫ్రాన్స్ జగజ్జేతగా నిలువగా, దీనిపై పుదుచ్చేరి (ఒకప్పుడు ఫ్రెంచ్ భూభాగం, ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతం) లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి చేసిన ట్వీట్ పై విమర్శలు వస్తున్నాయి.

ఫ్రాన్స్ గెలిచిన తరువాత "మేము పుదుచ్చేరియన్లం. ప్రపంచ కప్ గెలుచుకున్నాం. అభినందనలు" అని ఆమె ట్వీట్ పెట్టగా, నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మనం భారతీయులమని, ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లు ఆపాలని సలహాలు ఇస్తున్నారు. ఈ ట్వీట్ ను పలువురు నెటిజన్లు ఎగతాళి చేస్తున్నారు. ఫ్రాన్స్ జట్టు విజయాన్ని పుదుచ్చేరియన్ల విజయంగా ఆమె అభివర్ణించడాన్ని తప్పుబడుతున్నారు.

 కాగా, నిన్న రాత్రి ఫ్రాన్స్ విజయం సాధించిన తరువాత, పుదుచ్చేరిలోని వీధులు క్రీడాభిమానులతో కిక్కిరిశాయి. ఫుట్ బాల్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
Kiran Bedi
Puducherry
Twitter
Troling

More Telugu News