నెల రోజుల క్రితం ఇల్లొదిలి స్నేహితుల గదిలో ఉంటున్న యువతి ... రైలు పట్టాలపై మృతదేహం!
- హైదరాబాద్ శివారులోని ఘట్ కేసర్ వద్ద ఘటన
- ఆత్మహత్యకు ముందు ఇద్దరు యువకులతో ఘర్షణ పడిన కావేరి
- కేసు నమోదు చేసుకున్న పోలీసులు
ఆపై రాత్రి సమయంలో కావేరి, మరో ఇద్దరు యువకులు స్థానిక రైల్వే స్టేషన్ దగ్గర్లో గొడవ పడ్డారు. దీన్ని చూసిన కొందరు స్థానికులు వారిని ఆపేందుకు ప్రయత్నించారు కూడా. తెల్లారేసరికి కావేరి రైలు పట్టాల మధ్య విగతజీవితగా కనిపించగా, తల్లితో పాటు బంధువులకు సమాచారం అందింది. అమెతో పాటు గౌరి అనే మరో అమ్మాయి, జాన్సన్, తరుణ్ లు ఉండేవారని, తమ కుమార్తె మరణం వెనుక వారి ప్రమేయం ఉండవచ్చని, వారిని విచారించాలని బంధువులు డిమాండ్ చేశారు. కావేరి మృతికి ప్రేమ వ్యవహారం కారణమని తెలుస్తుండగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.