Pawan Kalyan: పవన్ కంటిలో కురుపు.. విజయవంతంగా శస్త్ర చికిత్స.. యాత్రకు బ్రేక్!
- పవన్ ఎడమ కంటిలో కురుపు
- ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో ఆపరేషన్
- యాత్రకు స్పల్ప విరామం
గత కొన్ని రోజులుగా కంటి సమస్యతో బాధపడుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎట్టకేలకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో చేరిన ఆయనకు వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్సను పూర్తి చేశారు. కంటి సమస్యతో పది రోజుల క్రితం పవన్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. పరిశీలించిన నిపుణులు ఎడమ కంటిలో కురుపు వుందని, శస్త్ర చికిత్స చేయించుకోవాలని సూచించారు.
ఇటీవల ఓ సందర్భంలో పవన్ మాట్లాడుతూ తాను చలువ కళ్లద్దాలు పెట్టుకుంటున్నదని స్టైల్ కోసం కాదని, కంటి సమస్యతో బాధపడుతున్నానని తెలిపారు. వెలుతురును చూడడం ఇబ్బందిగా ఉండడం వల్లే కళ్లద్దాలు పెట్టుకుంటున్నట్టు చెప్పారు. అప్పట్లో యాత్ర కారణంగా కొన్ని రోజులు వాయిదా వేసుకున్న పవన్ ఎట్టకేలకు ఆపరేషన్ చేయించుకున్నారు. శస్త్ర చికిత్స కారణంగా బస్సు యాత్రకు పవన్ కొంత విరామం ప్రకటించారు. ఈనెల 26 నుంచి తిరిగి యాత్ర ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.