shasi tharur: శశిధరూర్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం: కాంగ్రెస్ నేత రణ్ దీప్ సూర్జేవాలా

  • భారత్ కు పాకిస్థాన్ కు ఏమాత్రం పోలిక లేదు
  • భారతీయ విలువలు చాలా గొప్పవి
  • సామరస్యం, బహుళత్వం, వైవిధ్యానికి కాంగ్రెస్ పార్టీ ప్రతీక
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే భారతదేశం ‘హిందూ పాకిస్థాన్ గా మారుతుంది’ అంటూ కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ నేతలే కాదు, సొంత పార్టీ నేతలు కూడా ఆయనపై మండిపడుతున్నారు. శశిధరూర్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేలా ఉండటంతో ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సూర్జేవాలా స్పందించారు.

ఈ వ్యాఖ్యలు శశిధరూర్ వ్యక్తిగతమని, భారత్ కు పాకిస్థాన్ కు ఏమాత్రం పోలిక లేదని, భారతీయ విలువలు చాలా గొప్పవంటూ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. సామరస్యం, బహుళత్వం, వైవిధ్యానికి కాంగ్రెస్ పార్టీ ప్రతీక అని, వ్యాఖ్యలు చేసే ముందు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని సొంత పార్టీ నేతలకు సూచించారు.
shasi tharur
randeep surjewala

More Telugu News