35 ఏళ్ల తరువాత వింబుల్డన్ సెమీస్ లో సౌతాఫ్రికన్... సుదీర్ఘంగా సాగిన పోరులో రోజర్ ఫెదరర్ కు షాక్!
- ఐదు సెట్లు సాగిన మ్యాచ్
- చివరి సెట్లో 13-11 తేడాతో కెవిన్ ఆండర్ సన్ విజయం
- క్వార్టర్ ఫైనల్లోనే ముగిసిన ఫెదరర్ ఆట
చివరికి ఆండర్ సన్ చేతిలో 2-6, 6-7 (5), 7-5, 6-4, 13-11 తేడాతో ఫెదరర్ ఓటమి పాలయ్యాడు. ఈ మ్యాచ్ లో చెప్పుకోవాల్సింది నిర్ణయాత్మకమైన ఐదో సెట్ గురించే. తొలి నాలుగు సెట్లనూ చెరో రెండు గెలుచుకున్న తరువాత, ఐదో సెట్ దాదాపు రెండు గంటల పాటు సాగింది. సుదీర్ఘంగా సాగే పోరులో విజయాన్ని సాధించడం అలవాటుగా చేసుకున్న ఫెదరర్ కు ఈ మ్యాచ్ మాత్రం అచ్చిరాలేదు. కాగా, మరో మ్యాచ్ లో రఫెల్ నాదర్ మాత్రం గట్టెక్కాడు. జువాన్ మార్టిన్ డెల్ పాత్రోతో జరిగిన పోరులో 7-5, 6-7 (3), 4-6, 6-4, 6-4 తేడాతో గెలిచి సెమీస్ లోకి అడుగు పెట్టాడు.