'పోలవరానికి నిధుల కొరత లేదు'.. చంద్రబాబుతో కలిసి మీడియా సమావేశంలో నితిన్ గడ్కరీ
- ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్ర సర్కారు దృఢ నిశ్చయంతో ఉంది
- ప్రాజెక్టు శరవేగంగా పూర్తవుతోంది
- ఫిబ్రవరి నాటికి సివిల్ వర్క్స్ పూర్తి చేయాలి
- ముందస్తు నిధులు ఇవ్వాలని చంద్రబాబు అడిగారు
అనంతరం నితిన్ గడ్కరీ, చంద్రబాబు సంయుక్తంగా మీడియాతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ఫిబ్రవరి నాటికి సివిల్ వర్క్స్ పూర్తి చేయాలని తాను సంబంధిత అధికారులకు సూచించానని అన్నారు.
పోలవరానికి నిధుల కొరత లేదని అన్నారు. ముందస్తు నిధులు ఇవ్వాలని చంద్రబాబు అడిగారని, ఈ విషయంపై ఆర్థిక శాఖతో చర్చిస్తానని అన్నారు. సహాయ, పునరావాసాల్లో గిరిజన ప్రాంతాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. నీటి సదుపాయం ఉంటే ఎంత మేలు జరుగుతుందో ఓ రైతుగా తనకు తెలుసని అన్నారు.