paropoornananda: నగర బహిష్కరణపై హైకోర్టులో స్వామి పరిపూర్ణానంద పిటిషన్‌!

  • పోలీసులు భావ ప్రకటన స్వేచ్ఛను విస్మరిస్తున్నారన్న స్వామీజీ
  • తక్షణమే బహిష్కరణను తొలగించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌
  • లంచ్‌ మోషన్ కింద పిటిషన్‌ను స్వీకరించని హైకోర్టు
  • రేపు లేక ఎల్లుండి విచారించే అవకాశం

హిందూ మతంపై జరుగుతోన్న దాడులకు నిరసనగా 'ధర్మాగ్రహ' యాత్ర చేస్తానని ప్రకటించిన పరిపూర్ణానంద స్వామిని రెండు రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచిన పోలీసులు.. చివరకు హైదరాబాద్‌ నుంచి ఆరు నెలల పాటు బహిష్కరించిన విషయం తెలిసిందే. పోలీసుల తీరుకి నిరసనగా పరిపూర్ణానంద న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు.

తెలంగాణ పోలీస్ శాఖ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేసి, పోలీసులు భావ ప్రకటన స్వేచ్ఛను, రాజ్యాంగ హక్కులను విస్మరిస్తున్నారని పరిపూర్ణానంద ఆరోపించారు. తక్షణమే బహిష్కరణను తొలగించేలా ఆదేశాలివ్వాలని కోరారు. అయితే, ఆ పిటిషన్‌ను లంచ్ మోషన్ కింద స్వీకరించలేమని హైకోర్టు చెప్పింది. దీనిపై కోర్టు.. రేపు లేక ఎల్లుండి విచారణ జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News